ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ప్రమాదాలకు చెక్… డిఫెన్సివ్ డ్రైవింగ్‌ను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ ఆదేశాలు

ప్రమాదాలకు చెక్… డిఫెన్సివ్ డ్రైవింగ్‌ను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ ఆదేశాలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రోడ్డు భద్రతపై కీలక సూచనలు జారీ చేశారు. ప్రమాదానికి టిప్పర్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. హైవే వేగాన్ని గ్రామీణ రోడ్లపై కొనసాగించడం ప్రమాదకరమని హెచ్చరించారు.

డీజీపీ మాట్లాడుతూ—
“స్పీడ్ కంట్రోల్ మాత్రమే కాకుండా సెన్స్ కంట్రోల్ కూడా అత్యవసరం. రోడ్డు పరిస్థితిని బట్టి వేగం మార్చడం డ్రైవర్ బాధ్యత,” అని పేర్కొన్నారు. ఎదురుగా వస్తున్న వాహనాల వేగం, రోడ్డు వెడల్పు, మలుపుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపాలని సూచించారు.
ఈ ఘటనపై చేవెళ్ల ఏసీపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమించారు.
దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏమిటి?

డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది—
ఇతరుల తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను ముందుగానే గుర్తించి, తప్పించుకోవడం.

నిపుణుల ప్రకారం, ఇది కేవలం డ్రైవింగ్ టెక్నిక్ కాదు, ఒక మైండ్‌సెట్ —
“నా వల్ల ఎవరికీ ప్రమాదం జరగకూడదు, ఎవరి నిర్లక్ష్యం వల్ల నాకు ప్రమాదం జరగకూడదు.”

డీజీపీ సూచించిన ముఖ్య నియమాలు

ముందు వాహనం నుంచి కనీసం 3 సెకన్ల దూరం పాటించాలి.

రోడ్డు పరిస్థితిని బట్టి వేగం మార్చాలి.

రియర్ వ్యూ, సైడ్ మిర్రర్లు తరచుగా చెక్ చేయాలి.

లైన్ మార్చే ముందు లేదా మలుపు తీసుకునే ముందు ఇండికేటర్ తప్పనిసరి.

అలసట, మద్యం, ఫోన్‌ ప్రయోగం— పూర్తిగా నిషేధం.

డీజీపీ వెల్లడిచేస్తూ—
“ప్రతి డ్రైవర్ సేఫ్టీని ప్రాథమిక బాధ్యతగా తీసుకోవాలి. నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది. ఇకపై ఇలాంటి ఘటనలకు కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల నుంచి భారీ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….