ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  తుంగతుర్తి ఎస్ఐ వేధింపులకు మహిళ ఆత్మహత్య సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో విషాదం

తుంగతుర్తి ఎస్ఐ వేధింపులకు మహిళ ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో విషాదం
సూర్యాపేట,ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో జరిగిన దారుణ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ వేధింపులు తాళలేక ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే — వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ (50) అనే మహిళ తన బావ మల్లయ్య ఇంటిలో బంగారం పోయిందన్న అనుమానంతో ఇటీవల తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గత 15 రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా, గురువారం రాత్రి వరకు సోమనర్సమ్మను స్టేషన్లో ఉంచి విచారించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతికుమార్ మహిళను తీవ్రంగా బెదిరించి, “నీ ఫింగర్ ప్రింట్స్ బంగారం దొంగతనంలో ఉన్నాయని, జైలుకు పంపిస్తాం” అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అవమానభారం తాళలేక సోమనర్సమ్మ శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనతో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఎస్ఐ క్రాంతికుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జరగిన విషయంపై ఎస్ఐని వివరణ అడగగా, సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నట్లు సమాచారం.

గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు సోమనర్సమ్మ మరణానికి కారణమైన ఎస్ఐ క్రాంతికుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….