ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తం – రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తం – రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

పంట కోతను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచనలు

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, తుఫాను ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేశారు.

మంత్రులు మాట్లాడుతూ వర్షాల కారణంగా వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్ధాయిలో ప్రావర్తనం చేయాలని పేర్కొన్నారు. ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్ కవర్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు జరుగుతున్నందున రైతులు తమ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల సహాయంతో నమోదు చేసుకోవాలని సూచించారు. బయట రాష్ట్రాల నుండి అక్రమ ధాన్యం రాకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని చెప్పారు.

పౌరసరఫరాల కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, వరి రకాలపై మద్దతు ధరలను వెల్లడించారు.

వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్ధాయిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లాలో అన్ని సన్నద్ధతలు పూర్తి – కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు సమర్థవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. మొత్తం 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సి.సి.ఐ ఆధ్వర్యంలో 6 పత్తి కొనుగోలు కేంద్రాలు చేపట్టినట్లు వివరించారు.

రాబోయే రెండు రోజుల పాటు అధిక వర్షాలు ఉన్నందున పంట కోత తాత్కాలికంగా నిలిపివేయాలని రైతులకు సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నామని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ వివరాలను రోజువారీగా నివేదించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, మార్కెటింగ్ అధికారి నరేందర్, రవాణా శాఖ అధికారి వెంకటరమణతో సహా పలు అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….