ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  నిద్రమత్తులో కాంగ్రెసు పాలన రోడ్లు మరమ్మత్తులు వెంటనే చేయాలి రోడ్ల గుంతలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన

నిద్రమత్తులో కాంగ్రెసు పాలన
రోడ్లు మరమ్మత్తులు వెంటనే చేయాలి
రోడ్ల గుంతలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
మాయమాటలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను, అభివృద్ధిని వదిలేసి నిద్రమత్తులో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య పేర్కొన్నారు.

సోమవారం కరకగూడెం మండలంలోని అనంతారం బయ్యారం-తాడ్వాయి ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మరమ్మత్తులు వెంటనే చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిన సంక్షేమం, అభివృద్ధికి కొండంత దూరంలో వదిలేసి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని, జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న పర్యటనలకు మాత్రమే పనికి వస్తారని, ప్రజాభివృద్ధికి శూన్యమని సూచించారు. ప్రధాన రహదారిపై ఉన్న గుంతలమయంగా ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారిందని, రోడ్లు మరమ్మత్తులు చేయకుంటే ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆక్షేపించారు. జిల్లా మంత్రులు స్పందించి వెంటనే ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని రోడ్ల గుంతలకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుడగం రాము, కొమరం రాంబాబు, అత్తె నాగేశ్వరరావు, రేగా సత్యనారయణ, అత్తె సత్యనారయణ, గుడ్ల రంజిత్, బైరశెట్టి చిరంజీవి, ఊకే రామానాథం, పాయం నర్సింహారావు, గొగ్గల నాగమణి, పసునురి అంజయ్య, నిట్టా ఏడుకొండలు, ఈసం సమ్మయ్య, కోమ్మ ప్రసాద్, సుతారి నాగేష్, బట్టా బిక్షపతి, తాటి వెంగళరావు, యాకుబ్ ఖాన్, ఫాజ్జల్ హుసైన్, రాజేశ్వరరావు, పాయం కృష్ణ, అత్తె ముకుందా, ముగిళిపువ్వు వెంకన్న, నిట్టా ప్రభాకర్, సిద్ది సునీల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….