ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినిల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ — భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినిల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ — భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట
పినపాక ,ఆధాబ్ న్యూస్
వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా విద్యార్థినిల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రీమతి మ్రినాలి శ్రేష్ట అధికారులు, హెచ్ఎంలకు సూచించారు.

గురువారం పినపాక మండలం ఎలిసిరెడ్డిపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంటగది, డైనింగ్ హాల్, డార్మెటరీ, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థినిలతో మాట్లాడి వారికి సమయానికి మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదో లేదో తెలుసుకున్నారు.

విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించడంతోపాటు వర్షాకాలం కారణంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని హెచ్ఎం, వార్డెన్‌లను ఆదేశించారు. రాత్రి వేళల్లో విద్యార్థినిలు బయటకు రావొద్దని, విషపూరిత క్రిములు సంచరించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆశ్రమ పాఠశాలలో ఉన్న ఏఎన్ఎం లకు సరఫరా చేసిన మెడికల్ కిట్లను సబ్ కలెక్టర్ పరిశీలించి, విద్యార్థినిల ఆరోగ్య స్థితిని ప్రతిరోజు గమనిస్తూ అవసరమైన వైద్య చికిత్సలు తక్షణమే అందించాలన్నారు.

డైలీ వేజ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనడంతో పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేవని గుర్తించిన సబ్ కలెక్టర్, తాసిల్దార్ గోపాలకృష్ణకు రేపటిలోగా గ్రామపంచాయతీ సిబ్బందితో పూర్తిస్థాయి శుభ్రతా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. తాత్కాలికంగా వంట సిబ్బందిని నియమించి విద్యార్థినిలకు సమయానికి భోజనం అందేలా చూడాలని సూచించారు.

అలాగే కంప్యూటర్ క్లాసులను కూడా పరిశీలించిన సబ్ కలెక్టర్, విద్యార్థినిల ఆరోగ్యం, చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వంట సిబ్బంది పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని తెలిపారు. వడ్డించే ముందు ఉపాధ్యాయులు, హెచ్ఎం మొదట ఆహారం రుచి చూసి తరువాత విద్యార్థినిలకు అందించాలని సూచించారు.

ఈ తనిఖీలో పినపాక తాసిల్దార్ గోపాలకృష్ణ, హెచ్ఎం వీరాకుమారి, వార్డెన్ శ్రీమతి విజయ తదితరులు పాల్గొన్నారు.

— అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….