ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబానికి మానవత్వంతో సహాయం చేసిన ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వి

ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబానికి మానవత్వంతో సహాయం చేసిన ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో మానవత్వాన్ని చాటిన అటవీశాఖ మహిళా అధికారిణి ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వి ఆదర్శంగా నిలిచారు.

స్థానిక వ్యక్తి కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో గత 25 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి హైదరాబాద్‌లో మరణించారు. ఆయనకు ముగ్గురు చిన్న ఆడపిల్లలే ఉన్నారని తెలుసుకున్న తేజస్వి మేడం మనసు కదిలింది. ఆ కుటుంబానికి తన వంతు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో రూ.5,000లను తన సహాయకుడి ద్వారా అందజేశారు.

తన వృత్తి కర్తవ్యంతోపాటు మానవత్వాన్ని చూపించిన తేజస్వి, “ఆడపిల్ల ఎప్పుడూ తల్లిదండ్రులకు భారం కాదు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్ల కూడా కుటుంబానికి గర్వకారణమే” అని పేర్కొన్నారు.

తేజస్వి మేడం వ్యక్తిగతంగా ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చగా, గ్రామ పెద్దలు పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు తదితరులు సహాయం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామ పెద్దలు, బంధువులు తేజస్వి మేడం చూపిన మానవతా హృదయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….