ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.కోటి పరిహారం – అంబులెన్సులోనే జడ్జి విచారణ

రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.కోటి పరిహారం – అంబులెన్సులోనే జడ్జి విచారణ

ములుగు,ఆధాబ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన యువకుడికి జాతీయ లోక్‌ అదాలత్‌లో రూ.కోటి పరిహారం చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితుడు ఉన్న అంబులెన్స్ వద్దకే వెళ్లి జడ్జి విచారణ జరపడం విశేషంగా మారింది.

ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జాపతి వెంకటేశ్వర్లు పురుగుమందుల దుకాణంలో గుమాస్తాగా, ఆయన భార్య పద్మ రైతు కూలీగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు జాపతి దీక్షిత్‌ (22) బాచుపల్లిలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 2023 ఆగస్టు 12న స్నేహితులతో కలిసి అద్దెకారు తీసుకుని అనంతగిరి హిల్స్‌ విహార యాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దీక్షిత్ తలకు తీవ్ర గాయమై శరీరం చచ్చుబడిపోయింది.

బాధితుడి చికిత్స కోసం తల్లిదండ్రులు సుమారు రూ.60 లక్షలు అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ సంస్థపై రూ.1.50 కోట్ల పరిహారం కోరుతూ కోర్టులో కేసు వేశారు.

శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఈ కేసు విచారణకు వచ్చింది. బాధితుడు అంబులెన్స్‌లోనే ఉన్నట్లు తెలుసుకున్న న్యాయ సేవాసమితి చైర్‌పర్సన్‌, 12వ అదనపు చీఫ్‌ జడ్జి షౌకత్‌ జహాన్‌ సిద్దిఖీ నేరుగా అక్కడికే వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం నెలరోజుల్లోపు రూ.కోటి పరిహారం బాధితుడి ఖాతాలో జమ చేయాలని బీమా సంస్థను ఆదేశించారు. దీనికి బీమా సంస్థ ప్రతినిధులు అంగీకరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….