ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  కామ్రేడ్ అయోధ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి వ్యాఖ్య

కామ్రేడ్ అయోధ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి వ్యాఖ్య

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కామ్రేడ్ బొల్లోజు అయోధ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “కామ్రేడ్ అయోధ్య మరణం సిపిఐ పార్టీకే కాక, ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజలకు తీరని లోటు” అని అన్నారు.

గురువారం రామానుజవరం గ్రామంలో అయోధ్య స్వగృహానికి చేరుకున్న మధుసూదన్ రెడ్డి, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కామ్రేడ్ అయోధ్య ప్రజల మధ్యే జీవించి, వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడాడు. ప్రజలకు ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయనే. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, కమ్యూనిస్టు ఉద్యమాన్ని తుడిచిపెట్టేంతటి సంక్షోభాల్లోనూ నిబద్ధతతో ముందుండి పోరాడాడు” అన్నారు.

“తన కుటుంబం కోసం కాక, ప్రజల కోసం జీవితాన్ని అంకితమిచ్చిన మహనీయుడు కామ్రేడ్ అయోధ్య. మరణం మనమందరినీ తీవ్రంగా కలచివేసింది” అని భావోద్వేగంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) నాయకులు శెట్టిపల్లి నాగేశ్వరరావు, కురసం రామకృష్ణ, అలవాల సమ్మన్న, ఎండి యాకూబ్ అలీ, పి. సంజీవరెడ్డి, రాజకుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….