ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  రెడ్డిపాలెం గ్రామానికి ఫంక్షన్ హాల్ అవసరం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు గ్రామ పెద్దల వినతిపత్రం

రెడ్డిపాలెం గ్రామానికి ఫంక్షన్ హాల్ అవసరం

సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు గ్రామ పెద్దల వినతిపత్రం

 రెండు కోట్లు ఖర్చు చేస్తామన్న ఐటీసీ పీఎస్‌పీడీ సంస్థ
 ప్రభుత్వ స్థలం కేటాయించాలని గ్రామస్తుల వినతి

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామ ప్రజలు తమ గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు వేశారు. గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు వినతిపత్రం సమర్పించారు.

గ్రామస్థులతో పాటు యువత కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ వినతిలో వారు పేర్కొన్నదేమిటంటే – ఐటీసీ పీఎస్‌పీడీ సంస్థ రెండు కోట్లు ఖర్చు చేసి గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. అయితే, ఇందుకోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న మంటపం మరియు ముత్యాలమ్మ తల్లి దేవాలయం మధ్యలోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.

గ్రామస్థుల అభిప్రాయం:గ్రామంలో ఫంక్షన్ హాల్ లేకపోవడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ హాల్ అందుబాటులో ఉంటే ప్రతి కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది,” అని వారు వివరించారు.

 

వినతిపత్రం అందజేసిన వారు:

బూసిరెడ్డి శంకర్ రెడ్డి (మాజీ రోటరీ గవర్నర్ – రెండు తెలుగు రాష్ట్రాలు)

కుందురు శ్రీనివాసరెడ్డి

రెడెం రవీందర్ రెడ్డి

రెడెం కోటి రెడ్డి

పిల్లలమరి సుధాకర్

సమర సింహ రెడ్డి

శ్రీకాంత్ రెడ్డి తదితరులు

గ్రామ అభివృద్ధి దిశగా నడిచే సూచిక:

ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయిస్తే, ఇది రెడ్డిపాలెం గ్రామానికి ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాన్ని అందించడమే కాకుండా, ప్రభుత్వ, సమాజ కార్యక్రమాల నిర్వహణకు కొత్త దారితీయనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….