కరకగూడెంలో ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ పరీక్షలు
కరకగూడెం, ఆగస్టు 20 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి కాంప్లెక్స్ పరిధిలో మూడు పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు.
గత మూడు రోజులుగా సీఆర్పీలు పోలెబోయిన సాంబశివరావు, తోలేం విష్ణుమూర్తి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఎంపీపీఎస్ నీలాద్రిపేట, ఎంపీపీఎస్ కరకగూడెం పాఠశాలల్లో రెండో తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించి, వారి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Post Views: 32








