రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: రేగా కాంతారావుపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రేగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయంపై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైందని, ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ రేగా కాంతారావును ముందుకు నడిపిస్తుందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
తీర్పు వెలువడిన నేపథ్యంలో కరకగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రేగా అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, మండల నాయకులు కొమరం రాంబాబు, ఊకే రామానాథం, రేగా సత్యనారాయణ, వెంకటరెడ్డి, సోందుపాషా, కొమరం సత్యనారాయణ, ఎల్లు రామకృష్ణారెడ్డి, కనకయ్య, నర్సయ్య, లెనిన్, శ్రీను, సతీష్, యాకుబ్ ఖాన్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, రేగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.








