ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి

పెండింగ్‌లో ఉన్న చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం

ఆశ్వాపురం, ఆధాబ్ న్యూస్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆశ్వాపురం మండల తహసీల్దార్‌కు పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గద్దల రామకృష్ణ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే లబ్ధిదారులకు అందజేయడంతో పాటు పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలను నిలిపివేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం యూత్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్, ఆశ్వాపురం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చల్లా రాజేష్, ఆశ్వాపురం యూత్ వైస్ ప్రెసిడెంట్ రాసాల రమేష్, గొల్లగూడెం సర్పంచ్ కొండ్రు సమ్మయ్య, బీసీ సెల్ అధ్యక్షులు అరసవెల్లి పవన్, యువజన నాయకులు మంగళగిరి రామకృష్ణ, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….