కష్టకాలంలో తోడుగా కాంగ్రెస్ పార్టీ
మృతుడి కుటుంబానికి 75 కేజీల బియ్యం అందజేత
కరకగూడెం, ఆగస్టు 13 (ఆధాబ్ న్యూస్): కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ. పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు కొమరం రాంగోపాల్ ఇటీవల మృతి చెందగా, ఆయన దశదిన కర్మల నిమిత్తం కుటుంబ సభ్యులకు మొత్తం 75 కేజీల బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 25 కేజీల బియ్యం, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు 25 కేజీలు, మహిళా నాయకురాలు పూనెం శ్యాం కుమారి 25 కేజీల బియ్యాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు, కష్టకాలంలో కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు గొగ్గలి రవి, పోలేబోయిన సీతారాంబాబు, బిలపాటి సంపత్, ఉప సర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









