కమలాపురం శివారులో ఘోర హత్య
పనికి వచ్చిన కూలీల మధ్య గొడవ.. గొడ్డలితో వ్యక్తి హత్య
మంగపేట, ఆగస్టు 13 (ఆధాబ్ న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం శివారులో గురువారం ఘోర హత్య చోటుచేసుకుంది. పనికి వచ్చిన కూలీల మధ్య జరిగిన గొడవలో తాటి శేషు (38) అనే వ్యక్తిని నరసింహారావు గొడ్డలితో నరికి హత్య చేసినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Post Views: 31









