చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్య సమాచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 08 (ఆధాబ్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అన్ని వర్గాల దరఖాస్తుదారులకు తప్పనిసరిగా అవసరమైన పత్రాలు:
– పెన్షన్ దరఖాస్తు ఫారం
– ఆధార్ కార్డు
– వయస్సు ధృవీకరణ పత్రం (జనన ధృవీకరణ పత్రం / స్కూల్ సర్టిఫికేట్ / ఓటర్ ఐడీ)
– రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం
– బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ
వర్గాల వారీగా అదనంగా సమర్పించాల్సిన పత్రాలు:
1. వితంతు పెన్షన్ – నెలకు ₹2,016
– భర్త మరణ ధృవీకరణ పత్రం
2. ఒంటరి మహిళ పెన్షన్ – నెలకు ₹2,016
– విడాకుల పత్రం / కోర్టు ఉత్తర్వు / విడిపోయినట్లు ధృవీకరణ పత్రం
3. వికలాంగుల పెన్షన్ – నెలకు ₹4,016
– UDID లేదా SADAREM వికలాంగ ధృవీకరణ పత్రం
4. కల్లుగీత కార్మికుల పెన్షన్ – నెలకు ₹2,016
– ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం
5. చేనేత కార్మికుల పెన్షన్ – నెలకు ₹2,016
– చేనేత & వస్త్ర శాఖ ధృవీకరణ పత్రం
6. ఫైలేరియా పెన్షన్ – నెలకు ₹2,016
– DM&HO నమోదు మరియు ధృవీకరణ పత్రం
7. డయాలసిస్ పెన్షన్ – నెలకు ₹2,016
– ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్నట్లు నమోదు మరియు ధృవీకరణ పత్రం
పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారు తమ వర్గానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటు తప్పనిసరి పత్రాలను సమర్పించాలని సూచించారు. పత్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.









