రెండో విడత ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఆధాబ్ న్యూస్ భద్రాచలం | ఆగస్టు 6:
ఆగస్టు–2026 విద్యా సెషన్‌కు సంబంధించి ప్రభుత్వ ఆర్ఐటీఐ (RITI), అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లో వివిధ ట్రేడ్లలో రెండో విడత అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఐటీఐ భద్రాచలం ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు.
భద్రాచలం కృష్ణసాగర్‌లోని ప్రభుత్వ ఆర్ఐటీఐ, ఏటీసీలలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్, సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్ తదితర ట్రేడ్లలో ఉన్న ఖాళీ సీట్లకు అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి విడతలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రెండో విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 20న జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24వ తేదీ వరకు ప్రభుత్వ ఆర్ఐటీఐ, భద్రాచలం (కృష్ణసాగర్)లో హాజరై తమకు కేటాయించిన ట్రేడ్లలో ప్రవేశం పొందాలని తెలిపారు.
అడ్మిషన్ సమయంలో ఎస్ఎస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు, టీసీ, రెండు ఫోటోలు, జిరాక్స్ ప్రతులు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ITIలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు కోరారు.









