ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య యాత్రకు సన్నాహాలు
ఆధాబ్ న్యూస్, పినపాక ఆగస్టు 5:
పినపాక నియోజకవర్గంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6న నిర్వహించనున్న ప్రజా చైతన్య యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ఆగస్టు 6 నుంచి 12 వరకు జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి కుమార్ తెలిపారు.
రేపు (ఆగస్టు 6) ఉదయం 9 గంటలకు బయ్యారం నుంచి యాత్ర ప్రారంభమై పినపాక నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా మండల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కార్యదర్శి కుమార్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు మనోహర్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.









