కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి
ఆధాబ్ న్యూస్ కరకగూడెం 29 జూలై 2026
మణుగూరు డివిజన్ డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ సిబ్బంది అవసరాలను అడిగి తెలుసుకున్న డీఎస్పీ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31









