కొత్తగూడెం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం
కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మంగళవారం సందర్శించి అక్కడి పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థల అమలు, సైబర్ నేరాల నియంత్రణ చర్యలు, సాంకేతిక సేవల వినియోగంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సీఈఐఆర్ (CEIR), సీసీటీఎన్‌ఎస్ (CCTNS), ఈ-సాక్ష్య (e-Sakshya), నాట్‌గ్రిడ్ (NATGRID) వంటి ఆధునిక డిజిటల్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించి, సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసును త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ సముద్రాల జితేందర్, ఎస్‌ఐలు జుభేదా, గణేష్తో పాటు ఐటీ కోర్, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.









