మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. టూ వీలర్‌ను ఢీకొన్న లారీ.. ఒకరి పరిస్థితి విషమం
మణుగూరు, జూలై 25 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు నేతాజీ స్టేడియం గ్రౌండ్ సమీపంలో ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
Post Views: 26









