కరకగూడెం నూతన ఎంపీడీవోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
కరకగూడెం, జూలై 24 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మండల కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేస్తానని నూతన ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Post Views: 82









