మణుగూరులో పోలీసుల నాకాబంది.. 74 వాహనాల తనిఖీ
మణుగూరు, జూలై 23 (ఆధాబ్ న్యూస్):
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరులో గురువారం పోలీసులు విస్తృత నాకాబంది నిర్వహించారు. మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 74 వాహనాలను పరిశీలించారు.
తనిఖీల్లో 66 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక టాటా మ్యాజిక్ వాహనం, 2 ట్రాలీలు, 2 ట్రాక్టర్లను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, బీమా తదితర వివరాలను పరిశీలించి, నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచే ఉద్దేశంతో ఈ నాకాబంది నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై రహూఫ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









