అశ్వాపురంలో తప్పిన పెను ప్రమాదం
డివైడర్‌ను ఎక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు సురక్షితం
అశ్వాపురం, జూలై 23 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు 4:15 గంటలకు ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్‌ను ఎక్కింది. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన కారణంగా కొంతసేపు ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Post Views: 30









