ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ఆధాబ్ న్యూస్ కథనానికి అధికారుల తక్షణ స్పందన పెంటన్నగూడెం ఎంపీపీఎస్‌లో బాత్రూం తాళాలు తొలగింపు.. విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి

ఆధాబ్ న్యూస్ కథనానికి అధికారుల తక్షణ స్పందన

పెంటన్నగూడెం ఎంపీపీఎస్‌లో బాత్రూం తాళాలు తొలగింపు.. విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి

పినపాక, జూలై 22 (ఆధాబ్ న్యూస్):

ఆధాబ్ న్యూస్లో ప్రచురితమైన “మూడేళ్లుగా అందని బిల్లులు.. మూలనపడ్డ పాఠశాల బాత్రూంలు” కథనానికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. పినపాక మండలం పెంటన్నగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడేళ్లుగా తాళాలు వేసి ఉన్న బాలురు, బాలికల బాత్రూంలను  అధికారులు పరిశీలించి తాళాలు తొలగించి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.

కథనం వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బాత్రూంలకు ఉన్న తాళాలను తొలగించి, విద్యార్థులు వెంటనే వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.

ఇప్పటి వరకు బాత్రూంలు అందుబాటులో లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాలలో మిగిలిన మౌలిక వసతుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.

ఫోటో క్యాప్షన్: పెంటన్నగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో బాత్రూంలను పరిశీలించి తాళాలు తొలగిస్తున్న సంబంధిత అధికారులు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….