మణుగూరుకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి.. ఆచూకీ కోసం కరకగూడెం పోలీసుల విజ్ఞప్తి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ జూలై 21: కరకగూడెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పాయం సుమన్ (32) అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ఎస్ఐ పి.వి.ఎన్. రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన పాయం శైలజ తన భర్త పాయం సుమన్ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు “మణుగూరుకు వెళ్తున్నాను” అని ఇంటి నుంచి వెళ్లి, ఇప్పటి వరకు తిరిగి రాలేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కనిపించకుండా పోయిన పాయం సుమన్ సుమారు 5.4 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు, మధ్యస్థ శరీరాకృతి కలిగి ఉంటాడు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో టీ-షర్ట్, లోయర్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గమనించిన వారు వెంటనే కరకగూడెం పోలీస్ స్టేషన్ను 87126 82103 నంబర్‌లో సంప్రదించాలని ఎస్ఐ పి.వి.ఎన్. రావు ప్రజలను కోరారు.









