ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ.. మంత్రి సీతక్క వెల్లడి
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ : తెలంగాణలో అర్హులైన ఒంటరి మహిళలకు ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు అందజేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో అర్హుల వివరాలను సమగ్రంగా పరిశీలించి, పారదర్శకంగా జాబితాలను రూపొందించాలని సూచించారు. ఇప్పటికే పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశించారు.
అర్హుల తుది జాబితాలను త్వరలో ప్రకటించి, ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
Post Views: 94









