సీతమ్మసాగర్ ప్రాజెక్టు సందర్శనకు మణుగూరుకు చేరుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
మణుగూరు, జూలై 16 (ఆధాబ్ న్యూస్): సీతమ్మసాగర్ ప్రాజెక్టును సందర్శించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం మణుగూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మణుగూరుకు విచ్చేశారు.
మంత్రుల రాక సందర్భంగా జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు సీతమ్మసాగర్ ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరి నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణ, ప్రాజెక్టు అమలు పరిస్థితులను పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.









