ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  వీవోఏ-ఐకెపి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి: సీపీఐ

వీవోఏ-ఐకెపి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి: సీపీఐ డిమాండ్

పినపాక, జూన్ 1 (ఆధాబ్ న్యూస్): వీవోఏ-ఐకెపి కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పినపాక ఐకెపి కార్యాలయం ఎదుట వీవోఏ-ఐకెపి కార్మికులు చేపట్టిన సంయుక్త రిలే నిరాహార దీక్షలను సీపీఐ నాయకులు సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డం మనోహరాచారి, పత్తిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, వీవోఏలు అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జీతాల పెంపు కోసం ఆందోళనలు జరిగిన సమయంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీవోఏలకు నెలకు రూ.20 వేల కనీస వేతనం కల్పిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీవోఏలు చేపడుతున్న ఆందోళనలు పూర్తిగా న్యాయమైనవేనని పేర్కొంటూ, వారికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనం జీవన వ్యయాలకు ఏమాత్రం సరిపోవడం లేదని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీవోఏ-ఐకెపి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

వీవోఏల ఆందోళనలకు సీపీఐ, ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ పినపాక మండల కార్యదర్శి తోగటి కుమార్, సీపీఐ సీనియర్ నాయకుడు పద్మనాభరాజు, మండల సహాయ కార్యదర్శి కప్ప వెంకటేశ్వర్లు, మన్యం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….