ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  మానవత్వం చాటుకున్న యువ పినపాక ఉప సర్పంచుల సంఘం

మానవత్వం చాటుకున్న యువ పినపాక ఉప సర్పంచుల సంఘం
పినపాక, మే 26 (ఆధాబ్ న్యూస్):

పినపాక మండలం పాండంగాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు గోగ్గల అబ్బయ్య ఇల్లు అగ్నికి ఆహుతైన విషయం తెలుసుకున్న పినపాక మండల ఉప సర్పంచుల సంఘం మానవత్వంతో స్పందించింది. సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఉప సర్పంచులు కలిసి బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దాట్ల రాజేష్, ఉపాధ్యక్షుడు అచ్చ నవీన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం రోహిణి కార్తి కారణంగా తీవ్ర ఎండలు, ప్రకృతి విపత్తుల ప్రమాదాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఉప సర్పంచుల సంఘం తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి నిట్ట శిరీష, సహాయ కార్యదర్శి గంగిరెడ్డి సందీప్ రెడ్డి, మాటూరు రవీందర్, గొగ్గల కృష్ణ, రావేళ్ల నర్సమ్మ, నిట్ట వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….