పినపాక, కరకగూడెం మండలాలకు కొత్త పిన్ కోడ్ అమలు
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక, కరకగూడెం మండలాల పిన్ కోడ్‌లో మార్పు జరిగినట్లు పోస్టల్ ఐపీఓ రామ్మూర్తి తెలిపారు. శుక్రవారం పినపాకలో నిర్వహించిన పోస్టల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటివరకు వినియోగంలో ఉన్న 507117 పిన్ కోడ్ స్థానంలో ఇకపై 507113 పిన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.
ప్రజలు, వినియోగదారులు తమ ఉత్తర ప్రత్యుత్తరాలు, పోస్టల్ సేవలు, ఇతర అధికారిక పనుల కోసం ఇకపై కొత్త పిన్ కోడ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.
ఈ మార్పు ద్వారా పోస్టల్ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Post Views: 128








