భద్రాచలం RTA కార్యాలయం కొత్త భవనానికి మార్పు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భద్రాచలం రెవిన్యూ డివిజన్ పరిధిలోని రవాణా శాఖ (RTA) యూనిట్ కార్యాలయం కొత్త ప్రదేశానికి మారింది. ఇప్పటివరకు కూనవరం రోడ్‌లో కొనసాగుతున్న కార్యాలయాన్ని గురువారం నాడు ITDA కాంప్లెక్స్‌లోని జీవకా బ్లాక్ మొదటి అంతస్తుకు (మొబైల్ కోర్టు పక్కన) మార్చినట్లు అధికారులు తెలిపారు.
వాహనాలకు సంబంధించిన లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర సేవల కోసం ప్రజలు ఇకపై కొత్త కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యాలయాన్ని మార్పు చేసినట్లు తెలిపారు.
Post Views: 15








