ప్రతి క్షణం
ప్రజల పక్షం

  🛕 శ్రీ సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక లైటింగ్‌తో భక్తి వెలుగులు

🛕 శ్రీ సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక లైటింగ్‌తో భక్తి వెలుగులు

కరకగూడెం (ఆధాబ్ న్యూస్): భక్తి భావానికి ప్రతీకగా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. రానున్న శ్రీరామనవమి (శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం) సందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు చేపట్టారు.

గ్రామ సర్పంచ్ పోలేబోయిన సుజాత, ఉప సర్పంచ్ బుడగం రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేయించి, గుడి అలంకరణ కోసం నూతన లైట్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని,
శ్రీరామనవమి వేడుకలు శాంతి, ఐక్యతతో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పెద్దలు జలగం రామచంద్రు, శేఖర్, మురళీ, కృష్ణ, మండల నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

రాబోయే పండుగను పురస్కరించుకుని గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్