ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కొత్త రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి వర్తింపజేయాలి అదనపు కలెక్టర్‌కు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ వినతి

కొత్త రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి వర్తింపజేయాలి
అదనపు కలెక్టర్‌కు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ వినతి

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
మణుగూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని కొత్త రేషన్ కార్డుదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులు ఉన్నప్పటికీ చాలామంది లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తించడం లేదని తెలిపారు. ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, సాంకేతిక సమస్యలు మరియు డేటా అప్డేట్ లోపాల కారణంగా అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని క్షేత్రస్థాయిలో తెలిసిందన్నారు.

దీంతో నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని సూచనలు చేశారు:

గతంలో దరఖాస్తు చేసి ఆమోదం పొందినవారి వివరాలతో పాటు, కొత్త రేషన్ కార్డుదారుల దరఖాస్తులను ఎంపీడీవో మరియు మున్సిపల్ కార్యాలయాల్లో తిరిగి స్వీకరించేందుకు ఆదేశాలు ఇవ్వాలి.

కొత్తగా వివాహమైన వారు మరియు కొత్త కార్డుదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ శాఖ డేటాబేస్‌లో వివరాలు అప్డేట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.

ఈ అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని పాల్వంచ దుర్గ విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….