ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కోకాపేట్‌లో ‘అల్లు సినిమా’ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం సీఎం రేవంత్ రెడ్డి,

కోకాపేట్‌లో ‘అల్లు సినిమా’ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి,

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నగరంలోని కోకాపేట్‌లో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ‘అల్లు సినిమా’ థియేటర్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,  పాల్గొన్నారు. అల్లు కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, ప్రముఖ నటుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో నిర్మించిన ఈ థియేటర్ కాంప్లెక్స్ హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్ సినిమా రంగానికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘Telangana Rising 2047’ విజన్‌లో భాగంగా వినోద రంగాన్ని బలమైన పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ అల్లు కుటుంబం నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లకు మంత్రులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….