ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  రాగి-జొన్న జావలతో ప్రజా ఆరోగ్యానికి బాటలు ఆర్గానిక్ ఆహారంపై అవగాహన కల్పించిన పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

రాగి-జొన్న జావలతో ప్రజా ఆరోగ్యానికి బాటలు

ఆర్గానిక్ ఆహారంపై అవగాహన కల్పించిన పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

బూర్గంపహాడ్, ఫిబ్రవరి 19 ఆధాబ్ న్యూస్:
మొరంపల్లి బంజర్‌లోని పల్లెజావ దుకాణంలో లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఆహారం, చిరుధాన్యాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన ధ్యేయంగా పల్లెల్లో సహజ పద్ధతుల్లో పండే రాగి, జొన్న, గోధుమల వినియోగాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. టీ, కాఫీ వంటి పానీయాలకంటే రాగి, జొన్న జావలు తీసుకోవడం వల్ల షుగర్, రక్తపోటు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని, జీర్ణవ్యవస్థ మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

అలాగే రసాయనాలు లేకుండా పండించే ఆర్గానిక్ పంటలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు రైతులకు ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయని పేర్కొన్నారు. యువత, రైతులు సహజ ఆహారపు అలవాట్లను దైనందిన జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరిగితే గ్రామీణ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని, పల్లెల్లో ఆర్గానిక్ జావ దుకాణాలు పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు సమగ్ర ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

రైతుల సమిష్టి కృషితో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….