ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్  (ఆధాబ్ న్యూస్) :
జిల్లాలో రేపు ఆదివారం నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఏడు మండలాల్లో 138 గ్రామపంచాయతీలకు సర్పంచ్ పదవులకు, 1,006 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పోలింగ్ అనంతరం అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖతో సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!