ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  అక్రమ నగదు–మద్యం రవాణాను అరికట్టాలని సూచనలు భద్రాచలం SST చెక్పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

అక్రమ నగదు–మద్యం రవాణాను అరికట్టాలని సూచనలు
భద్రాచలం SST చెక్పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు మరియు మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు భద్రాచలం బ్రిడ్జ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలెన్స్ టీం) చెక్పోస్టును ఎస్పీ ఈరోజు పరిశీలించారు.

చెక్‌పోస్టు వద్ద జరుగుతున్న వాహన తనిఖీలను పరిశీలించిన ఎస్పీ, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయాలని అక్కడి అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా పనిచేస్తూ, ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు, మద్యం వంటి అక్రమ రవాణాలను ఖచ్చితంగా అరికట్టాలని సూచించారు.

పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ప్రక్రియ సజావుగా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….