ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ఆడపిల్లలు.. తల్లిదండ్రుల నీడ లేక ఒంటరిగా మిగిలిన అక్కాచెల్లెళ్లు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి చదువే ఆశ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్‌లైన్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ నూతన ఎస్‌ఐ రఘుకు ఉపసర్పంచ్‌ల సంఘం ఘన సత్కారం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు ప్రభుత్వ హెచ్చరిక

  వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి

వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి
రంగారెడ్డి, ఆధాబ్ న్యూస్:
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాల నుండి ఇంటికి వస్తున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కుమారుడు రిత్విక్ (3)పై వీధి కుక్కలు దాడి చేశాయి.

ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అతన్ని అత్యవసరంగా హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడి ఎడమ కంటిలో చూపు పూర్తిగా కోల్పోయినట్టు నిర్ధారించారు.

తమ చిన్నారి చూపు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వీధి కుక్కల ఉనికి పెరుగుతోందని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు