ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  చేప పిల్లలను సకాలంలో చెరువుల్లో వదలాలి – మంత్రి వాకాటి శ్రీహరి

చేప పిల్లలను సకాలంలో చెరువుల్లో వదలాలి – మంత్రి వాకాటి శ్రీహరి

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా చేపల ఉత్పత్తిని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో సోమవారం మత్స్యశాఖ సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి, మత్స్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిల్, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామని, ఇందుకోసం రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని తెలిపారు. ఇప్పటికే చేప పిల్లల కొనుగోలు టెండర్‌ పూర్తైన జిల్లాల్లో చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మాంసాహారంలో చేపల ప్రాముఖ్యత, ప్రోటీన్‌ విలువ, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. జూరాల వంటి జలాశయాల వద్ద చేపల స్టాల్స్‌, ఐస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆక్వా కల్చర్‌ అభివృద్ధి చేయాలని, దాంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూచించారు. చేప పిల్లల వదలిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మత్స్యకార సంఘాలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను సకాలంలో వదులుతున్నామని కలెక్టర్ తెలిపారు. నీటి లభ్యతను పరిశీలించి ఇరిగేషన్‌ శాఖతో సమన్వయం చేసుకొని చేప పిల్లల వదలిక కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు.

అదేవిధంగా, “టీ మత్స్య మొబైల్ యాప్‌” ద్వారా లబ్ధిదారుల వివరాల నమోదుకు ఇప్పటికే అవగాహన కల్పించామని, ప్రతి లబ్ధిదారు తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ ఏడి ఇంతియాజ్ ఖాన్‌ సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….