ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ప్రశాంత వాతావరణంలో ముగిసిన మద్యం దుకాణాల డ్రా : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రశాంత వాతావరణంలో ముగిసిన మద్యం దుకాణాల డ్రా : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా కార్యక్రమం సోమవారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ — రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించి లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని తెలిపారు. అభ్యర్థులందరికీ సమాన హక్కులు కల్పించేందుకు లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించామని, ప్రతి దశలోనూ మానవీయ జోక్యం లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు.

కార్యక్రమం మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో, వీడియో రికార్డింగ్‌తో పాటు ఎల్ఈడి స్క్రీన్‌పై ప్రజల ముందే నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడిందని చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ డ్రా కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు పూర్తయిందని వెల్లడించారు.

జిల్లాలో మొత్తం 3,922 దరఖాస్తులు అందగా, 88 మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయించబడ్డాయని తెలిపారు. మండలాల వారీ వివరాలు అధికారికంగా విడుదల చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు లైసెన్స్ ఫీజులు నిర్ణీత కాలంలో చెల్లించి, తదుపరి చర్యలు పూర్తిచేయాలని సూచించారు.

మద్యం విక్రయంలో ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు, సమయాలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా హెచ్చరించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించే అక్రమ దుకాణాలు, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

డ్రా కార్యక్రమం మొత్తం ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అభ్యర్థులు, అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….