ముంచుకొస్తున్న మరో తుఫాన్ – సైక్లోన్ ‘శక్తి’
ఆధాబ్ న్యూస్,తెలంగాణ:
అరేబియా సముద్రంలో మరోసారి తుపాను రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఏర్పడుతున్న ఈ తుపానుకు ‘సైక్లోన్ శక్తి’ అనే పేరు పెట్టారు.
సమాచారం ప్రకారం, ద్వారకకు ఈశాన్య దిశలో 240 కిలోమీటర్ల దూరంలో, పోర్బందర్‌కు 270 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.
Post Views: 33









