జెన్కో ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల పనితీరును పరిశీలించిన ఎస్సై
ఆధాబ్,న్యూస్: మణుగూరు
దమ్మకపేట గ్రామ పరిధిలోని అసిస్టెంట్ కమాండ్ కార్యాలయం వద్ద జెన్కో సంస్థ బీటీపీఎస్, కేటీపీఎస్, వైటీపీఎస్ ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల పనితీరును మణుగూరు ఎస్సై రంజిత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నదాన్ని ఆయన సమీక్షించారు. జెన్కో సంస్థ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
Post Views: 24









