ప్రతి క్షణం
ప్రజల పక్షం

టీబీ నిర్మూలనకు ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ఆడపిల్లలు.. తల్లిదండ్రుల నీడ లేక ఒంటరిగా మిగిలిన అక్కాచెల్లెళ్లు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి చదువే ఆశ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్‌లైన్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ

  73 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పతకాలు – భద్రాద్రి జిల్లా ఎస్పీ అభినందనలు

భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావు పవర్ లిఫ్టింగ్ ఇండియా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశారు. కేరళ రాష్ట్రంలో ఆగస్టు 2 నుండి 7 వరకు జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆయన నాలుగు బంగారు పతకాలు సాధించారు.

ఈ విజయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేకంగా శంకర్రావును అభినందించారు. ఆయన మాట్లాడుతూ – “73 ఏళ్ల వయసులో, హార్ట్ బైపాస్ సర్జరీ అనంతరం కేవలం ఆరు నెలల్లోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలను అధిగమించి జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం. ఇది వయసు, ఆరోగ్య సమస్యలు మనసులో ఉన్న సంకల్పానికి అడ్డుకాదని నిరూపించింది” అని పేర్కొన్నారు.

జిమ్ కోచ్ జివి రామిరెడ్డి శిక్షణలో సాధించిన ఈ విజయం అన్ని వయసుల వారికి స్ఫూర్తినిచ్చేలా ఉందని ఎస్పీ తెలిపారు. “సంకల్పం అడ్డంకులను మైలురాళ్లుగా మార్చుతుంది. వృద్ధాప్యాన్ని పరిమితి కాకుండా కొత్త అవకాశాలుగా చూడాలి” అని సందేశం ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు