ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణలో మరో వారం రోజులపాటు కుండపోత వర్షాలు

: తెలంగాణలో మరో వారం రోజులపాటు కుండపోత వర్షాలు

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
గత వారం రోజులుగా తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండగా, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 7 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

శనివారం నుంచి ఆగస్టు 15 వరకు కుండపోత వర్షాలు కొనసాగనున్నాయని అంచనా. ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 12, 13, 14, 15 తేదీల్లో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో విస్తారమైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

హైదరాబాద్‌లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోత వాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్