*మాయా సృష్టి కీలేడి ఈమె*
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
*బిచ్చగాళ్ల వీర్యంతో పిల్లలు లేని వారికి సంతానం కల్పిస్తున్న స్పెర్మ్ క్లినిక్‌లు*
డాక్టర్ నమ్రత కేసులో విస్తుపోయే నిజాలు
బిచ్చగాళ్లకు బిర్యాని, అడ్డకూలీలకు మద్యం, చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు, అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇచ్చి వీర్యం, అండాల సేకరణ పేరుతో దందా
ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో.. సికింద్రాబాద్‌లో దందా నడుపుతున్న డాక్టర్ నమ్రత
డాక్టర్ నమ్రతతో సహ ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
దాతల నుంచి వీర్యం, అండాలు కోరుకునేవారు.. ఆ దాతలు బాగా చదువుకున్నవారై, తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు..
కానీ.. ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డాకూలీల వీర్యాన్ని, అండాలను..
పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్న ఆధారాలు
నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తులు, 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి.. వారికి అన్నిరకాల వైద్యపరీక్షలూ నిర్వహించి, ఎలాంటి జన్యవ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్దారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి..
ఒక దాత నుంచి 25సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించడం.. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి.
కానీ ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్న స్పెర్మ్ క్లినిక్ లు









