ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ రవీందర్ రెడ్డి

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డిఎస్పీ రవీందర్ రెడ్డి ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. గంజాయి వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనించాలంటూ సూచించారు.

“గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మారి యువత తమ విలువైన జీవితాన్ని మసకబారుస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి,” అని డిఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

అలాగే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేనివారికి ప్రమాదాల నుంచి రక్షణ లేదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాలపై కూడా ప్రజలను హెచ్చరించారు. “ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండే ఈ డిజిటల్ యుగంలో, రకరకాల లింకులు, ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి. కొందరు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. అందుకే అనుమానాస్పద లింకులను తడబడకుండా తక్షణమే తొలగించాలి,” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సైబర్ భద్రత, యువత భవిష్యత్తు రక్షణలో భాగంగా పోలీసులు నిరంతరం కృషి చేస్తారని డిఎస్పీ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….