ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం లో భారీ అగ్ని ప్రమాదం – 10 మంది కార్మికుల మృతి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం లో భారీ అగ్ని ప్రమాదం – 10 మంది కార్మికుల మృతి
సంగారెడ్డి, ఆధాబ్ న్యూస్:
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమల ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సిగాచి అనే రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, కొంతమంది కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు తర్వాత పరిశ్రమ అంతటా మంటలు విస్తరించాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.

ప్రారంభిక సమాచారం ప్రకారం 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. పరిశ్రమలో ఇంకా కొంతమంది కార్మికులు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు పూర్తి సమాచారం త్వరలో వెల్లడించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….