ఇందిరమ్మ ఇల్లు భూమి పూజలో పాల్గొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మోతె గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు ముదురుకోళ్ల వెంకన్నకు నూతనంగా నిర్మించబోయే ఇంటి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం” అని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గౌ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతి బడుగు, బలహీన వర్గానికి న్యాయం జరుగుతోంది” అని చెప్పారు.
కార్యక్రమంలో
మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు, అభిమానులు తదితరులు విస్తృతంగా హాజరయ్యారు.









