ఐటీసీ కర్మాగారంలో కార్మికుడు మృతి.. భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. పద్మ ఇన్సులేషన్ కాంట్రాక్టర్ ద్వారా క్యాజువల్‌గా పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.
ప్రమాదం ఐటీసీ ఫ్యాక్టరీలోని PM7 డిపార్ట్మెంట్ వద్ద జరిగినట్లు సమాచారం. కార్మికుడు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం ప్రాణాన్ని తీసింది. మృతుడి వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.
Post Views: 29









