ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు పట్టుబడ్డ సీఐ, టీవీ రిపోర్టర్.

మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు పట్టుబడ్డ సీఐ, టీవీ రిపోర్టర్.
మణుగూరు,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అవినీతి చిట్టా బయటపడింది. మణుగూరు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సోమ సతీష్ కుమార్ (ఏఓ-1), బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపీ (ఏఓ-2) లను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి నుండి రూ. 4 లక్షల లంచం డిమాండ్ చేసిన ఈ ఇద్దరు వ్యక్తులు, అందులో రూ. 1 లక్ష తీసుకుంటుండగా మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో ACB అధికారులు వారిని పట్టుకున్నారు. గోపీ, మధ్యవర్తిగా వ్యవహరించి బాధితుల పేర్లు కేసులో చేర్చకుండా చూడాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నంబర్ 150/2025 కింద నమోదు చేయబడింది. కేసులో భారతీయ న్యాయ విభాగంలోని BNS సెక్షన్లు 318(4), 329(3) మరియు తెలంగాణ రాష్ట్ర గేమింగ్ సవరణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించాయి. ACB అధికారులు రాసాయనిక పరీక్షలు నిర్వహించి, అభియోగాలపై బలమైన ఆధారాలు సేకరించారు.
ఇద్దరినీ అరెస్ట్ చేసిన తరువాత వారిని వారంగల్ ఎస్పీఈ & ఎసీబీ కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతోంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం కావాలని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అధికారులకు 1064 నెంబర్కు ఫిర్యాదు చేయవలసిందిగా తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….